ETV Bharat / city

ఆరేళ్లుగా ప్రశ్నిస్తున్నా.. మరో అవకాశం ఇవ్వండి: రాంచందర్​రావు - graduate elections news

గత ఆరేళ్లుగా శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నానని హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ పట్టభద్రుల నియోజకవర్గం భాజపా అభ్యర్థి రాంచందర్​రావు అన్నారు. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ram chander rao
ఆరేళ్లుగా ప్రశ్నిస్తున్నా.. మరో అవకాశం ఇవ్వండి: రాంచందర్​రావు
author img

By

Published : Mar 3, 2021, 2:21 PM IST

ఏ సమస్యల సాధన కోసం తెలంగాణ ఏర్పాటైందో ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్‌రావు అన్నారు. రాష్ట్ర యువతను నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుందని తెలిపారు.

గత ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై శాసన మండలిలో ప్రశ్నిస్తూ వస్తున్నానని.. తన గొంతును మరింత వినిపించేందుకు మళ్లీ బలపరచాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్​ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణాకాంత్​పార్క్​లో ఆయన ప్రచారం చేశారు. పార్క్‌ మొత్తం కలియ తిరుగుతూ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.

ఇవీచూడండి: 'సురభి వాణీదేవిని అఖండ మెజార్టీతో గెలిపించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.