కొత్త ఏడాదిని న్యూ ఇయర్ ఆఫ్ ప్రొటెక్షన్గా భావించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జాతీయ సమాచార కేంద్రం(ఎన్ఐసీ) రూపొందించిన ఇ-డైరీని రాజ్‌భవన్‌లో ఆమె ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందన్న గవర్నర్... హైదరాబాద్‌లోని పలు పరిశోధనా కేంద్రాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయని తెలిపారు. టీకా ఉత్పత్తిలో భారత్... ముఖ్యంగా హైదరాబాద్ ప్రధానపాత్ర పోషించడం అందరికీ గర్వకారణమని అన్నారు. భారత్ పలుదేశాలకు వ్యాక్సిన్‌ను అందించే స్థాయిలో ఉందన్న గవర్నర్....ఇందుకు లాక్డౌన్ సమయంలో 150 దేశాలకు మందులు అందించడమే నిదర్శనమన్నారు.
త్వరలో హైదరాబాద్ ఫార్మా కాపిటల్‌గా మారనుందని తెలిపారు. ప్రధాని మోదీ కూడా భారత్ బయోటెక్‌ను సందర్శించి శాస్త్రవేత్తలను ఉత్తేజపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరించాలని ఆమె కోరారు. కొవిడ్ సమయంలో ముందుడి పోరాడిన పలు శాఖల అధికారులకు సెల్యూట్‌గా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నారు. ఈ డైరీ రూపొందిచిన ఎన్‌ఐసీ అధికారులను ఆమె అభినందించారు.
ఇదీ చదవండి: 2020 జీవితంలో విలువైన పాఠాలు నేర్పింది: కేటీఆర్