ETV Bharat / city

రాజ్‌భవన్‌ పరివారం కోసం ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు

రాజ్‌భవన్‌ పరివారం కోసం ఏర్పాటు చేసిన కొవిడ్​ ఐసోలేషన్​ కేంద్రాన్ని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ప్రారంభించారు. కొవిడ్ సోకిన వారి కోసం కాలనీల్లో సంక్షేమ సంఘాలు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు.

governor
రాజ్‌భవన్‌ పరివారం కోసం ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు
author img

By

Published : May 14, 2021, 3:09 AM IST

కొవిడ్ సోకిన వారి కోసం కాలనీల్లో సంక్షేమ సంఘాలు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. రాజ్​భవన్ పరివారం కోసం సంస్కృతి కమ్యూనిటీ హాల్​లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సహకారంతో పది పడకలతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరమైన ఔషధాలు, ఆహారంతో పాటు వైద్యచికిత్స అందిస్తామని తెలిపారు. కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాలు మైక్రో కంటైన్మెంట్ జోన్ల మాదిరిగా స్వల్ప లక్షణాలున్న వారికి ఉపయోగపడతాయన్నారు. ఇళ్లలో సరైన వసతులు లేక కుటుంబసభ్యులు వైరస్ బారిన పడిన పడుతున్నారని... అటువంటి వారికి మేలు చేకూరుస్తాయని గవర్నర్‌ వివరించారు.

ఇదీ చదవండి: 'కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.