ఆహార భద్రత కల్పించడంలో సుస్థిరవ్యవసాయం ముఖ్యమని గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. భారీ జనాభా ఉన్న దేశానికి నిరంతర ఆహార భద్రతను అందించేందుకు స్థిరమైన వ్యవసాయ పద్ధతులు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. డాక్టర్ స్వామినాథన్ అవార్డు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని రోటరీక్లబ్ ఆఫ్ మద్రాస్ ఈస్ట్ ఆధ్వర్యంలో వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్... ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ఎస్ పరోడాకు పురస్కారాన్ని అందించారు.
'మనం ప్రకృతిని కాపాడుకుంటే, ప్రకృతి మనల్ని రక్షిస్తుంది' అనే సరళమైన ఆలోచనను గట్టిగా నమ్ముతున్నానని గవర్నర్ తెలిపారు. దేశంలో హరిత విప్లవ పితామహుడైన డాక్టర్ స్వామినాథన్ సహకారం వల్లే... భారత్ సహా ఇతర దేశాలు ఆకలి నుంచి బయటపడ్డాయని వివరించారు. దేశంలోని ఆహార ధాన్యాల ఉత్పత్తిని తక్కువ వ్యవధిలో రెట్టింపుచేయడం.. భారతీయ వ్యవసాయం పరివర్తన డాక్టర్ స్వామినాథన్ భారీ ప్రయత్నాల వల్లే సాధ్యమైందని తమిళిసై తెలిపారు.