విశ్వవిద్యాలయాలకు పూర్తిస్థాయి ఉపకులపతులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సూచించినట్లు సమాచారం. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నట్లు తెలిసింది. కళాశాలల్లో ప్రత్యక్ష బోధనపై యూనివర్సిటీల ఇంఛార్జి వీసీలు, రిజిస్ట్రార్లతో తమిళిసై ఇటీవల సమావేశం నిర్వహించారు.
యూనివర్సిటీల్లో పూర్తిస్థాయి వీసీలు లేకపోవడం, తదితర అంశాలను అధికారులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో చర్చించిన అంశాలు, పలు సమస్యలను పరిష్కరించాలని సూచిస్తూ ప్రభుత్వానికి గవర్నర్ లేఖ రాసినట్లు సమాచారం.