ETV Bharat / city

ఆ సమయంలో ఆయిల్​ కంపెనీలు అద్భుతంగా పనిచేశాయి: గవర్నర్​ - గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

కొవిడ్​ విపత్కర పరిస్థితుల్లో ఆయిల్​ కంపెనీలు అద్భుత పనితీరును కనబరిచాయని గవర్నర్​ కొనియాడారు. ఇండియన్ ఆయిల్, హెచ్​పీసీఎల్​, భారత్ పెట్రోలియం సంస్థల ప్రతినిధులను గవర్నర్​ అభినందించారు.

ఆ సమయంలో ఆయిల్​ కంపెనీలు అద్భుతంగా పనిచేశాయి: గవర్నర్​

author img

By

Published : Mar 10, 2021, 4:25 AM IST

కరోనా మహమ్మారి సమయంలో ఆయిల్ కంపెనీలు అద్భుత పనితీరును ప్రదర్శించాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. దేశం మొత్తం లాక్​డౌన్​లోకి వెళ్లిన సమయంలో అవసరమైన నిత్యావసర, అత్యవసర వస్తువుల రవాణాలో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాన్ని నిరంతర సరఫరా చేశాయని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సేవలకు గుర్తింపుగా రాజ్ భవన్​లో ఇండియన్ ఆయిల్, హెచ్​పీసీఎల్​, భారత్ పెట్రోలియం సంస్థల ప్రతినిధులను గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందించారు.

పుదుచ్చేరిలోని రాజ్ నివస్ నుంచి గవర్నర్ ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. హైదరాబాద్ రాజ్​భవన్​లో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆయిల్ కంపెనీల ప్రతినిధులను సత్కరించారు. ఆయిల్ వినియోగంలో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉందని.. ఈ కేటగిరీలో దేశం స్వయం సంవృద్ధి సాధించే దిశగా ఎదగాలని గవర్నర్ ఆకాంక్షించారు.

  • I appreciate them for their tremendous services.
    Mr. CK Narasimha (General Manager, HPCL)
    Mr. Saibal Mukherji ( Telangana State head, BPCL).
    Mr. Shravan S Rao ( State head, IOCL). pic.twitter.com/HjgYOPNaFA

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: ఈనెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.