తార్నాకలోని జాతీయ పోషకాహర సంస్థ(ఎన్ఐఎన్)లో ఒరిజినల్ డాటా వర్క్షాప్ను గవర్నర్ తమిళి సై ప్రారంభించారు. ఈ సందర్భంగా... సాంప్రదాయ ఆహారాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. అందులోనే పోషకాలు మెండుగా ఉంటాయని తెలిపారు. అందుకే పూర్వీకులు ఎక్కువకాలం జీవించారని పేర్కొన్నారు.
ఆరోగ్య భారతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పోషక పథకాలు అమలు చేస్తున్నాయని కొనియాడారు. పోషకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలలో రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్ఐఎన్ డైరెక్టర్ హేమలత.. సంస్థ కార్యకలాపాల గురించి వివరించారు.
ఇవీ చూడండి: మూగజీవాల సంరక్షణ కోసం.. చిన్నారి అక్షర యజ్ఞం