ETV Bharat / city

రిజిస్ట్రేషన్​ శాఖలో పూర్తి ప్రక్షాళన దిశగా సర్కార్

రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ శాఖలో ధరణి పోర్టల్‌, కార్డ్‌ సాప్ట్‌వేర్‌లను ఏకీకృతం చేసే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. రెండింటినీ ఏకీకృతం చేయడంలో తలెత్తుతున్న తప్పొప్పులను మాన్యువల్‌గా సరిద్దిద్దాల్సిందిగా రిజిస్ట్రేషన్‌ శాఖను సర్కార్​ ఆదేశించింది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. డాక్యుమెంట్‌ రైటర్ల విషయంలో ఇతర రాష్ట్రాల్లో ఏలా ఉందని అడిగిన ప్రభుత్వం... పూర్తి వివరాలు తెప్పించుకుంది.

government seeking information from registrations department

author img

By

Published : Sep 30, 2020, 2:13 PM IST

రిజిస్ట్రేషన్‌ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశలో కసరత్తు చేస్తున్న ప్రభుత్వం... అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది. తరచూ ప్రభుత్వం అడుగుతున్న వివరాలను రిజిస్ట్రేషన్‌ శాఖ ఎప్పటికప్పుడు అందచేస్తోంది. గడిచిన మూడేళ్లకు చెందిన... ఆర్థిక సంవత్సరాల వారీగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా రిజిస్ట్రేషన్ల సంఖ్య, తద్వారా వస్తున్న ఆదాయం, మండలాల వారీగా జరుగుతున్న డాక్యుమెంట్ల సంఖ్య తద్వారా వస్తున్న రాబడుల వివరాలు తెప్పించుకుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల మధ్య ఉన్న దూరాలు... వాటి పరిధిలో ఉన్న మండలాలు ఎన్ని... గ్రామాలు ఎన్ని, పట్టణాలు ఎన్ని, ప్రధాన పట్టణాలు ఉంటే అవి ఎంత దూరంలో ఉన్నాయి... తదితర వివరాలను కూడా రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రభుత్వానికి అందచేసింది.

మౌలిక వసతులపై ఆరా...

రాష్ట్రంలో ఉన్న 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎన్నింటికి సొంత భవనాలు ఉన్నాయి... సొంతభవనాల నిర్మాణానికి ఎన్నింటికి స్థలం కేటాయింపు జరిగింది... నిర్మాణాల్లో ఉన్నవి ఎన్ని... ఇప్పుడున్న మౌలిక వసతులు ఏమిటి... ఇంకా ఎలాంటి వసతులు కావాలి... తదితర వివరాలను కూడా అడిగింది. ఇప్పటికే 80 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు స్థలం కేటాయింపు జరిగిందని... సొంత భవనాలు కలిగి ఉన్న 30 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కూడా అవసరమైన మేరకు మౌలిక వసతులు లేవని... సిబ్బంది కొరత ఉందని... నివేదించింది. అయితే ప్రభుత్వం సమగ్ర వివరాలు కావాలని అడగడంతో... సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా సిబ్బంది కొరత, మౌలిక వసతుల కల్పనకు, ఇతరత్ర అవసరాలకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలతో నివేదించినట్లు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

మిగతా రాష్ట్రాల విధానాలపై అధ్యయనం...

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా డాక్యుమెంటు రైటర్లు ఎందరు ఉన్నారు? వారి వివరాలు... వారి విద్యార్హతలు... ఎంత మంది లైసెన్స్‌దారులు ఉన్నారు. లైసెన్స్‌ లేని వారెందరు? తదితర వివరాలను కూడా రిజిస్ట్రేషన్‌ శాఖ నివేదించింది. డాక్యుమెంటు రైటర్ల విధానం బయట రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఏవిధంగా ఉందో తెలుసుకుని నివేదించాలని సూచించించినట్లు తెలుస్తోంది.

మెరుగైన విధానంపై దృష్టి...

వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములకు ధరల నిర్ణయం ఏలా జరిగింది... ఎంత కాలమైంది... ఇప్పుడున్న విధానంలో వస్తున్న ఇబ్బందులు ఏమిటి... ఇంతకంటే మెరుగైన విధానం ఏమైనా ఉందా ? తదితర వివరాలను కూడా ప్రభుత్వం అడిగినట్లు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు తెలిపారు. సబ్‌ రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారులు ఏయే సెక్షన్ల కింద ఉన్నాయి...వాటి వల్ల జరుగుతున్న లాభం ఎంత... నష్టం ఎంత, ఆయా సెక్షన్లను తొలిగిస్తే వచ్చే సమస్యలు ఏమిటి...? తదితర వివరాలను కూడా తెప్పించుకున్న ప్రభుత్వం... విచక్షణాధికారాలను తొలిగించాలని ఇప్పటికే నిర్ణయించిట్లు తెలుస్తోంది.

నిషేధిక ఆస్తులపై సర్కార్​ నజర్​...

అన్నింటికంటే కీలకమైన విషయం...సెక్షన్‌ 22 సబ్‌ సెక్షన్‌- ఏ కింద రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం ద్వారా నిషేధిత భూములు, ఆస్తుల వివరాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అందచేయాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లు ఈ విధానం అమలు కావడం లేదు. దీని వల్ల నిషేధిత భూములు కూడా కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి రావటం వల్ల... దీనిని కూడా పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.

తహసీల్దార్లకు మరోసారి శిక్షణ...

నిషేధిత జాబితాలో ఉన్న వాటిని ఎట్టి పరిస్థితుల్లో విక్రయాలు జరగకుండా చూడాల్సి ఉన్నందున అందుకోసం ఏ విధానం బాగుంటుందన్న కోణంలో పరిశీలన చేస్తున్నట్లు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు తెలిపారు. అదే విధంగా ఇప్పటికే తహసీల్దార్లు ఒకసారి పది రోజులపాటు రిజిస్ట్రేషన్ల శాఖ గురించి శిక్షణ పొందారు. ఇప్పుడు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ మండల రెవెన్యూ కార్యాలయాల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మరొకసారి ఎమ్మార్వోలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ధరణి పోర్టల్​పై రిజిస్ట్రేషన్​న్​ శాఖకు శిక్షణ...

ధరణి పోర్టల్‌పై రెవెన్యూ శాఖకు అవగాహన ఉండగా రిజిస్ట్రేషన్‌ శాఖకు ఏలాంటి అవగాహన లేదు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గతంలో మాదిరి వ్యవసాయేతర భూములు, భవనాలు, వాణిజ్య సముదాయాల రిజిస్ట్రేషన్‌ చేయడంతో పాటు ఆ వెంటనే మ్యూటేషన్‌ కూడా చేయాల్సి ఉండడం వల్ల... ఆ విధానంతో పాటు ధరణి పోర్టల్‌, మ్యూటేషన్లపై సబ్‌రిజిస్ట్రార్‌లకు కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్‌ శాఖ స్పష్టం చేస్తోంది.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా...

ఇలా వివిధ రకాల సమాచారం తెప్పించుకుంటున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు పున: ప్రారంభమయ్యే సమయానికి ఏలాంటి ఇబ్బందులు రాకూడదన్న దృష్టితో కసరత్తు చేస్తోంది. తాజాగా... ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ల శాఖ ఉపయోగిస్తున్న కార్డ్‌ సాప్ట్‌వేర్‌ను, ధరణి పోర్టల్‌తో జరుగుతున్న ఏకీకృతం ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో... వాటిని అన్ని విషయాలు తెలిసిన సబ్‌రిజిస్ట్రార్‌ల ద్వారా పరిష్కారం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖకు సూచించిన రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో గ్రామాల వారీగా పరిశీలన చేసి తప్పొప్పులను సవరించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: 'ధరణి' కోసం రెవెన్యూ ఉద్యోగులకు పూర్తి స్థాయి శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.