ETV Bharat / city

"బిల్ట్ పరిశ్రమను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధం"

author img

By

Published : Sep 18, 2019, 1:20 PM IST

బిల్ట్ పరిశ్రమను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కంపెనీ పునరుద్ధరణపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయని... యాజమాన్యం, ప్రతినిధులు పునరుద్ధరణకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.

"బిల్ట్ పరిశ్రమను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధం"

మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించాలనే లక్ష్యంలో భాగంగా బల్లార్‌పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు (బిల్ట్) అవసరమైన సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. శాసన సభలో ఎమ్మెల్యే సీతక్క అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. గతంలో సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపిన విషయం కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు. బిల్ట్ కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీ పునరుద్ధరణపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయని... యాజమాన్యం, ప్రతినిధులు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరిశ్రమ పునరుద్ధరణ ద్వారా మారుమూల ప్రాంతాల్లో వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.

ఇవీ చూడండి: త్వరలో ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.