AP CM on Ukraine victims: ఉక్రెయిన్‌లోని ఏపీ ప్రజల తరలింపుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎస్, సీఎంఓ అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల హాజరయ్యారు. రాష్ట్రస్థాయిలో తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా కేంద్రాల్లో కాల్‌సెంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో టచ్‌లో ఉండాలన్న సీఎం సూచించారు. యోగక్షేమాలు తెలుసుకుని భద్రతా చర్యలు చేపట్టాలన్నారు సీఎం. రాష్ట్ర ప్రజలకు తగిన మార్గనిర్దేశం చేయాలని.. కేంద్ర అధికారులకు అవసరమైన సమాచారం ఇవ్వాలని తెలిపారు. తెలుగువారి నుంచి సమాచారం వస్తే విదేశాంగశాఖకు తెలపాలన్నారు. తెలుగువారి తరలింపులో రాష్ట్రం నుంచి సహకరించాలని అధికారులను ఆదేశించారు.
విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్ ఫోన్..
విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారని.. వారి తరలింపునకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. విద్యార్థుల తరలింపునకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని..ప్రత్యేక విమానాల్లో తరలిస్తామని కేంద్రమంత్రి తెలిపారు.
Helpline numbers to AP students: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల కోసం.. రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. విద్యార్థుల సౌకర్యార్థం ఈమెయిల్, వాట్సప్ నంబర్లను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది.
- 24గంటల హెల్ప్‌లైన్ నంబర్లు: 0863 2340678(ఫోన్)
8500027678 (వాట్సప్) - రాజధానే లక్ష్యం- ఏ క్షణమైనా రష్యా ఆధీనంలోకి ఉక్రెయిన్
Russia Ukraine War: రష్యా మొదటి గురి తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాతి లక్ష్యం తన కుటుంబమని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. రష్యా తక్షణమే ఆక్రమణలు ఆపి.. చర్చలకు రావాలని కోరారు. దాడులు ఆపేంతవరకు మేం పోరాడుతూనే ఉంటామని చెప్పారు.
Russia Ukraine News : రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల సాయం అందుతుందని భావించామని, కానీ అలాంటిది ఏమీ జరగలేదని వాపోయారు. స్వాతంత్య్ర పోరాటంలో తాము ఒంటరిగా మిగిలామని అన్నారు. సైనిక లక్ష్యాలపై మాత్రమే దాడి చేస్తున్నామని రష్యా చెబుతున్నా.. పౌరులపైనా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. తాను రాజధాని విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఎంతటి క్లిష్ట పరిస్థితులలోనైనా తాను ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు.
"నేను రాజధాని కీవ్‌ను విడిచిపెట్టినట్లుగా అనేక నకిలీ వార్తలు వస్తున్నాయని నాకు తెలుసు. అలాంటిదేమీ లేదు. నేను నా దేశ ప్రజలతో కలిసి రాజధానిలోనే ఉన్నాను. నేను మా భాగస్వామ దేశాలన్నింటినీ అడుగుతున్నాను. మీరు ఉక్రెయిన్‌తో ఉన్నారా? లేరా? ఒకవేళ ఉన్నాం అనే సమాధానమిస్తే మమ్మల్ని నాటో కూటమిలోకి తీసుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేరు. మా దేశ భద్రత హామీల గురించి మాట్లాడేందుకు మేము భయపడం. మా దేశ రక్షణ మాటేమిటి? ఆ హామీని ఏ దేశాలు మాకు అందిస్తాయి అనేదే చూస్తున్నాం." -జెలెన్ స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం..
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో(యూఎన్ఎస్సీ) తీర్మానానికి శుక్రవారం ఓటింగ్ జరగనుంది. అమెరికా, అల్బేనియా దీన్ని ప్రవేశపెట్టనున్నాయి. యూఎన్ఎస్సీలో వీటో అధికారం ఉన్న రష్యాను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసే ఉద్దేశంతో దీనిని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
Telugu Students @ Ukraine: 'ఉక్రెయిన్‌లో ఉన్న మా పిల్లలను స్వదేశానికి రప్పించాలి'