ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన గ్రామ ,వార్డు వాలంటీర్లపై వేటు వేయాలని అధికారులు నిర్ణయించారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వారిని నియమించాలని ఉత్తర్వులు ఉన్నా.. వయోపరిమితి పాటించకుండా కొన్ని చోట్ల నియమకాలు జరిగాయి. వారిని తొలగించాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు గ్రామ వార్డు సచివాలయాల విభాగం కమిషనర్ జీఎస్ నవీన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
వాలంటీర్లలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.. 35 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నవారు నియమితులైనట్లు గుర్తించామని నవీన్ కుమార్ తెలిపారు. దీనివల్ల అర్హత లేని వారి గౌరవ వేతనాలను చెల్లించడం సాధ్యపడటం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన వారిని వెంటనే తొలగించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు.
ఇవీ చదవండి: 'అన్నదాతలను అందలం ఎక్కించేందుకే.. కొత్త చట్టాలు'