ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర రాష్ట్రాల్లోనూ ఉచిత వైద్యసేవలు

Health cards ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ తరహాలోనే ఇతర రాష్ట్రాల్లో వైద్య సేవలు పొందేందుకు అనుమతిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈహెచ్​ఎస్ కార్డుల​ ద్వారా ఉద్యోగులు వైద్యం పొందొచ్చు. మెడికల్ బిల్లులు సమర్పించిన 21 రోజుల్లోనే ఆటోడెబిట్ ద్వారా చెల్లింపులకు ఆంగీకారం తెలిపింది.

government-issued-orders-allowing-government-employees-health-cards-for-medical-services-in-other-states

author img

By

Published : Aug 13, 2022, 7:49 PM IST

Health cards: ప్రభుత్వ ఉద్యోగులు ఈహెచ్ఎస్ కార్డు ద్వారా.. ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందేందుకు ఏపీ సర్కారు అనుమతించింది. అంతేకాదు.. ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం జాబితాలో ఇప్పటివరకు లేని 565 వైద్య సేవలను కొత్తగా చేర్చింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం పొందిన వారికి బిల్లులను.. ఆరోగ్య శ్రీ తరహాలోనే 21 రోజుల్లో ఆటోడెబిట్ స్కీమ్ ద్వారా చెల్లింపులకు ప్రభుత్వ అంగీకారం తెలిపింది. ఈ విధానం వల్ల.. విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులూ ఈహెచ్ఎస్ కార్డుపై ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందనున్నారు.

ఇటీవల ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన మంత్రుల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈహెచ్ఎస్​పై ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ కార్డుల సమన్వయం కోసం ఆరోగ్యమిత్రలకు ఆదేశాలు జారీ చేస్తామని కూడా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.