మనోహరాబాద్-కొత్తపల్లి, అక్కన్నపేట-మెదక్ రైలు మార్గాల పనులకు సంబంధించి... రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల విడుదలను ఆలస్యం చేస్తోందని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. లోక్ సభలో ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైలు మార్గంలో... తెలంగాణ రాష్ట్ర వాటా 307 కోట్ల రూపాయలని వెల్లడించారు.
రాష్ట్రం ఇంకా రూ. 50 కోట్లు ఇవ్వాలి
ఇప్పటివరకు రాష్ట్రం 60 కోట్ల రూపాయలను మాత్రమే జమ చేసిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అక్కన్నపేట-మెదక్ మార్గానికి సంబంధించి 105 కోట్లకు గానూ 21 కోట్ల రూపాయలను మాత్రమే జమ చేశామన్నారు. ఇప్పటివరకు చేసిన పనులకు రాష్ట్రం ఇంకా 50 కోట్ల రూపాయలను ఇవ్వాల్సి ఉందని.. ఆ భారం ఈ రెండు రైలు మార్గాల పనులపై పడుతోందని వివరించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీపై కేసీఆర్కు కేంద్రం నుంచి సూచనలు: లక్ష్మణ్