Vaccination Guidelines in AP: 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్‌పై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జనవరి 3 నుంచి వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం కొవాగ్జిన్ టీకానే వేస్తున్నట్టు ప్రకటించింది. అర్హులంతా కొవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
వైద్య ఆరోగ్య కేంద్రాల్లోనూ ... స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు జనవరి 10 నుంచి బూస్టర్ డోసు వేయనున్నట్లు వివరించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు దాటితేనే బూస్టర్ డోసు వేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రెండు డోసులు తీసుకున్న 60 ఏళ్లు దాటిన వారికి సైతం బూస్టర్ డోసు వేయనున్నారు.
ఇదీ చదవండి: DH srinivas on omicron variant: 'సంక్రాంతి తర్వాత థర్డ్ వేవ్.. బీ అలర్ట్'