రాష్ట్రంలో టీబీ కేసుల పెరుగుదలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నాటికి టీబీని నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ కేసులు పెరగడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. భవిష్యత్లో క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో సేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు క్షయవ్యాధి నియంత్రణ అధికారుల బృందంతో గవర్నర్ సమావేశం కానున్నారు.
ఇదీ చూడండి: రహదారిపై రారాజులా సంచరిస్తూ.. భయం పుట్టిస్తున్న పెద్దపులి