శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరూ ఈ ఉగాది పండుగను ఉత్సహంగా ఆనందంగా జరుపుకోవాలని కోరారు. శ్రీ శార్వరి నామ సంవత్సరం తెలుగు వారందరి జీవితాలలో వెలుగులు నింపాలని, ఈ సంవత్సరం అంతా తెలుగు ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలన్నారు.
కరోనా మహమ్మరిని అత్యంత ధైర్యసాహసాలతో ఎదుర్కొని విజయం సాధించాలని హృదయ పూర్వకంగా ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో మనం, మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులందరు ప్రభుత్వం సమయానుసారం ఇచ్చే అన్ని సూచనలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉందామనే సంకల్పం తీసుకొందామని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కఠిన నిర్ణయాలు తప్పట్లేవ్'