ETV Bharat / city

కల్నల్ సంతోశ్​​కు ప్రముఖుల నివాళి... సూర్యాపేటకు పార్ధివ దేహం - సంతోష్ బాబుకు రేవంత్ రెడ్డి నివాళి

కల్నల్​ సంతోశ్​ బాబు పార్థివదేహం హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బయలుదేరింది. రేపు ఉదయం అంతిమయాత్ర నిర్వహించి, కేసారంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

governer pay tributes to colnal santosh babu at hakeempet airport
కల్నల్ సంతోష్​ బాబుకు ప్రముఖుల నివాళి
author img

By

Published : Jun 17, 2020, 9:48 PM IST

హకీంపేట విమానాశ్రయం నుంచి కల్నల్ సంతోశ్​​ బాబు పార్థివదేహాం స్వస్థలం సూర్యాపేటకు బయలుదేరింది. విమానాశ్రయంలో ఆర్మీ అధికారులు, సిబ్బంది సైనిక వందనం సమర్పించారు. గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, జగదీశ్​ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, మేయర్​ రామ్మోహన్​, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ సజ్జనార్​, మేడ్చల్​ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఉన్నతాధికారులు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ రోజు రాత్రికి కల్నల్​ సంతోష్​ బాబు భౌతిక కాయం సూర్యాపేటకు చేరుకోనుంది. రేపు సూర్యాపేట నుంచి ఆయన స్వస్థలం కేసారం వరకు అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు సైనిక లాంఛనాలతో ఆయన స్వస్థలంలో అంతిమ సంస్కరాలు నిర్వహించేందుకు... సైనికాధికారుల పర్యవేక్షణలో, జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు పూర్తి చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.