ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ విధులు నిర్వర్తించినపుడే అధికారులు విజయం సాధించినట్లని గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో గ్రూప్-1 శిక్షణ అధికారుల వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు.. క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేయాలని అధికారులకు సూచించారు. దస్త్రాన్ని పేపర్ లాగా చూడకుండా..అది ఓ మనిషికి సంబంధించిన అంశంగా గుర్తించాలన్నారు. సాధారణ పౌరులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని వివరించారు.
ఇదీ చూడండి : చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న కర్ణాటక సీఎం