ప్రజలు బయటకు రాకుండా లాక్డౌన్ విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. రైతులను ఆదుకోవాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో 'ఫోన్ కొట్టు.. పండ్లు పట్టు' అనే పేరుతో మార్కెటింగ్ శాఖ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పండ్లు ఎవరికైనా కావాలంటే 7330733212 నంబరుకు పోన్ చేస్తే ఇంటి వద్దకే సరఫరా చేసేందుకు నిర్ణయించింది.
30 ప్యాక్‌లకు ఆర్డర్ ఇస్తే నేరుగా జంట నగరాల్లో కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల సరఫరా చేయనున్నట్టు మార్కెటింగ్ శాఖ వెల్లడించింది. ధరలు కింది విధంగా ఉన్నాయి. రూ. 300లకు కిలోన్నర మామిడి, 3 కిలోల బొప్పాయి, కిలో సపోట, రెండున్నర కిలోల బత్తాయి, 12 నిమ్మకాయలు, 4 కిలోల కలంగిరి కూడిన ప్యాక్ అందించనున్నట్టు మార్కెటింగ్ శాఖ వెల్లడించింది.
ఇప్పటికే మొబైల్ రైతు బజార్ల ద్వారా రోజుకు 550 కేంద్రాల్లో ప్రజల వద్దకు పండ్లు, కూరగాయలను చేరవేస్తున్నట్టు వివరించారు. జంటనగరాల్లో మూడున్నర వేలకు పైగా ప్రాంతాలకు సరఫరా చేసినట్టు తెలిపారు. నేరుగా వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతుల నుంచే సేకరిస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి వెల్లడించారు. 30 టన్నుల బత్తాయి, 10 టన్నుల మామిడి, 6 టన్నుల సపోట, 8 టన్నుల కలంగిరి(వాటర్ మిలన్), 2 టన్నుల నిమ్మ,10 టన్నుల బొప్పాయి సరఫరా చేస్తున్నట్లు అమె వివరించారు.
ఇదీ చూడండి: కేసీఆర్ చెప్పిన 'హెలికాప్టర్ మనీ'కి అర్థమేంటి?