కరోనా కట్టడి నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పుల్లెల గోపిచంద్ అకాడమీలోని ప్లేయర్లు, కోచ్‌లు, సిబ్బంది కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2.5 లక్షలు విరాళంగా అందించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు రూ.2.5 లక్షలు, జీహెచ్ఎంసీ, గచ్చిబౌలి డివిజన్‌కు రూ.2.5 లక్షలు అందించారు. వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్, సీపీ సజ్జనార్‌కు రాసిన లేఖలో గోపిచంద్ అకాడమీ వెల్లడించింది.
ఇవీచూడండి: సమన్వయ లోపమే కారణం