ETV Bharat / city

గూడ్స్‌ బండీ... కొత్తగా మారెనండీ! - lorries in train in south west zone

మనకెప్పుడూ గూడ్సు రైలంటే చిన్నచూపే! కానీ కరోనా వేళ ఆ గూడ్సు రైలే దేశవ్యాప్తంగా ఆహారం కొరత రాకుండా చూసుకుంది. ఇందుకోసం తన రూపాన్నీ మార్చుకుని, వేగాన్నీ పెంచుకుంది. ఫలితంగా కరోనా వేళ దేశంలో మరే సరకు రవాణా సంస్థ అందుకోనన్ని లాభాల్ని సొంతం చేసుకుంది. దీని వెనక ఆయా రైల్వే డివిజన్‌లు చేపట్టిన వినూత్న ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఆసక్తికరమైన ఆ విశేషాలేమిటో చూద్దామా!

Good trains in Indian railway helped in lock down during corona pandemic
గూడ్స్‌ బండీ... కొత్తగా మారెనండీ!
author img

By

Published : Sep 20, 2020, 11:53 AM IST

రోరో.. రైలెక్కిన లారీ!

గూడ్సు రైళ్లలో ఒకటోరెండో లారీలు వెళుతుండటం అడపాదడపా చూసే ఉంటాం! కానీ-కేవలం లారీల కోసమే గూడ్సు రైళ్లని నడపడానికి తాజాగా శ్రీకారం చుట్టింది నైరుతి(సౌత్‌ వెస్టర్న్‌) రైల్వే జోన్‌. బెంగళూరు శివారులోని నీలమంగళ నుంచి మహారాష్ట్ర షోలాపూర్‌దాకా మొత్తం 682 కిలోమీటర్లు ఇది నడుస్తుంది. రోల్‌-ఆన్‌ రోల్‌-ఆఫ్‌ అనే ఈ రైళ్లలో మొత్తం 42 లారీలు వెళ్లొచ్చు. వాటితోపాటూ డ్రైవరూ, టికెట్‌ క్లీనరూ ప్రయాణించవచ్చు(వాళ్లు సెకెండ్‌ క్లాసు టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది!). రైల్లో వెళ్లడానికి బదులు లారీలు రోడ్డుమార్గంలోనే వెళ్లొచ్చు కదా అనుకుంటున్నారా! సాధారణంగా బెంగళూరు-షోలాపూర్‌ మార్గంలో ఓ సరకు రవాణా లారీ వెళ్లాలంటే దాదాపు 38 గంటలు పడుతుంది. అదే రైలు అయితే 17 గంటలు చాలు. మనదేశంలో 1999 నుంచే కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ తన పరిధిలో ఈ తరహా సేవల్ని అందిస్తున్నా... భారత రైల్వేకి చెందిన ఓ ప్రధాన జోన్‌ దీన్ని ప్రారంభించడం ఇదే మొదలు!

రైతన్నలకి ‘జై’!

సమస్యని సమస్యలా కాకుండా అవకాశంగా చూడాలంటుంది నేటి కార్పొరేట్‌ సంస్కృతి. ప్రభుత్వ సంస్థ అయినా కూడా ఆ మాటల్ని అక్షరాలా నిరూపించింది దక్షిణ మధ్య రైల్వే! దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మొదలై రోడ్డు రవాణా స్తంభించడంతో... రాష్ట్రాల మధ్య ఆహారధాన్యాలు, ఇతర అత్యవసర వస్తువుల రవాణా నిలిచిపోయింది. ఆ కొరతని తీర్చడానికి ‘జై కిసాన్‌’ గూడ్సు రైలుని ప్రవేశపెట్టింది దక్షిణ మధ్య రైల్వే. రెండు గూడ్సు రైళ్లని కలిపితే ఏర్పడ్డ రైలు ఇది. ఒకే రాష్ట్రంలో... దగ్గరదగ్గరగా ఉండే రెండు ప్రాంతాలకి రెండు గూడ్సు రైళ్లు వెళ్లాలనుకోండీ. ఆ రెండింటినీ ఒకే రైలుగా చేసి రెండు ప్రాంతాలకీ మధ్యలో ఉన్న రైల్వే జంక్షన్‌కి వీటిని పంపిస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ఈ పె..ద్ద రైలు ద్వారా ఒకేసారి 5,200 టన్నుల ఆహార ధాన్యాన్ని సరఫరా చేయగలుగుతున్నారు. దీని ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రైతులు ఉత్పత్తి చేసిన ఆహారధాన్యానికి నష్టం రాకుండా చూడగలుగుతున్నారు. అందుకే దీనికి ‘జై కిసాన్‌’ అనీ పేరుపెట్టారు.

సాధారణంగా గూడ్సు రైళ్లకి ఓ సమయమంటూ ఉండదు. అలాకాకుండా- వాటికి కచ్చితమైన టైంటేబుల్‌ని పెట్టి ‘కార్గో ఎక్స్‌ప్రెస్‌’ అనే మరో కొత్త తరహా రైళ్లని తెచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి దిల్లీ దాకా నడుస్తున్నాయి. మామూలు సరకు రైళ్ళు గంటకు ఇరవైమూడు కిలోమీటర్లు నడిస్తే ఇవి 46 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు-తెలుగు రాష్ట్రాల నుంచి బంగ్లాదేశ్‌కి నడుపుతున్న ‘పంట రైళ్లు’ ఇంకో ఎత్తు! ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి మిరప, నిజామాబాద్‌ నుంచి పసుపు పంటల ఎగుమతి కోసం వీటిని కొత్తగా మొదలుపెట్టారు. రోడ్డుమార్గంలో వీటి రవాణాకి ప్రతి టన్నుకీ ఏడువేల రూపాయలు ఖర్చయ్యేవట. లాక్‌డౌన్‌తో ఇరుదేశాల మధ్య రవాణా ఆగిపోవడంతో 4,200 రూపాయలకే తాము ఎగుమతి చేస్తామని ముందుకొచ్చింది రైల్వే. అన్నట్టు... ఓ పొరుగుదేశానికి గూడ్సు రైలు నడపడం కూడా ఇదే తొలిసారి!

మనం ఆవిష్కరించాం!

అవసరం ఆవిష్కరణలకి అమ్మలాంటిదని అంటారు కదా! విజయవాడ రైల్వే డివిజన్‌ విషయంలో అదే నిజమైంది. లాక్‌డౌన్‌ కారణంగా, స్పెషల్‌ రైళ్లు తప్ప ప్రయాణికుల రైళ్లేవీ నడవడం లేదు. దాంతో ప్యాసింజర్‌ రైళ్లకి ఉపయోగించే ఇంజిన్‌లన్నీ షెడ్డుల్లోనే నిద్రపోతున్నాయి. మరోవైపు-గూడ్సు రైళ్ల అవసరమేమో పెరుగుతోంది. వాటికి కావాల్సిన ఇంజిన్‌లు మనదగ్గర తక్కువగా ఉంటున్నాయి. ఖాళీగా ఉన్న ప్యాసింజర్‌ రైళ్ల ఇంజిన్‌ల సామర్థ్యం గూడ్సు రైళ్లని లాగడానికి సరిపోదు.

ఈ సమస్యను నివారించడానికి కొత్త పద్ధతిని కనిపెట్టారు విజయవాడ డివిజన్‌కి చెందిన రైల్వే నిపుణులు. రెండు ప్రయాణికుల ఇంజిన్‌లని(డబ్ల్యూపీ4) కలపడం ద్వారా పార్సిల్‌ రైళ్లకి అనువుగా వాటిని మార్చగలిగారు! ఇందుకోసం 25 రోజులపాటు శ్రమించారు విజయవాడ రైల్వే డివిజన్‌ సిబ్బంది. సాధారణంగా ఓ ప్యాసింజర్‌ రైలు ఇంజిన్‌ ఖాళీగా ఉండటం ద్వారా గంటకి 5.4 లక్షల రూపాయల నష్టం వస్తుందట! అదే ఇప్పుడు వీటిని గూడ్సు రైళ్లకి వాడటం ద్వారా 4.2 లక్షల రూపాయల లాభం సాధించారు. అందుకే వీరి విజయాన్ని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా అభినందించారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.