Field Assistants Return to Work: ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ విధుల్లో చేరనున్నారు. నేటి నుంచే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించగా.. మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థులు ఆందోళన చేశారు. పార్టీ నేతలు, ఇతర రూపాల్లో వచ్చిన విజ్ఞప్తులు, డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్... ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంలో రాష్ట్రవ్యాప్తంగా 7305 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ విధుల్లో చేరనున్నారు. గతంలో పనిచేసిన స్థానాల్లోనే ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధులు నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి: