ETV Bharat / city

Gone Prakash Rao: 'భాజపా అనుకుంటే జగన్ జైలుకెళ్లడం ఖాయం' - గోనె ప్రకాష్ రావు

భాజపా అనుకుంటే ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దయ్యి.. జైలుకెళ్లడం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్​రావు. తిరుపతి ప్రెస్ క్లబ్​లో మాట్లాడిన ఆయన.. వైఎస్ వివేకాను కుటుంబ సభ్యులే చంపారని ఆరోపించారు. కొందరు వైకాపా నేతలు హత్యను.. గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

భాజపా అనుకుంటే జగన్ జైలుకెళ్లడం ఖాయం: గోనె ప్రకాష్ రావు

author img

By

Published : Jun 18, 2021, 6:47 PM IST

మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) ఏపీ సీఎం జగన్ (ap cm jagan) పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ బెయిల్ రద్దయ్యి జైలుకు పోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలు చెబుతుంటే వైకాపా నేతలు, పార్టీ శ్రేణులు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇలానే బెదిరింపులకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. జగన్ అసలు స్వరూపాన్ని బయటపెడతానన్నారు. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ మీడియా సమావేశాలు నిర్వహించి జగన్ స్వరూపాన్ని బయట పెట్టే ధైర్యం ఉందన్నారు.

విజయమ్మకు షోకాజ్ నోటీసులు ఇవ్వరా..

వైఎస్సార్ పాదయాత్రలో జగన్ ఏ రోజు పాల్గొనలేదని.. వైఎస్ విజయమ్మ తన పుస్తకంలో అవాస్తవాలు రాశారన్నారు. వైకాపా గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ.. ఖమ్మంలో ఏర్పాటు చేసిన షర్మిల సభలో ఏ విధంగా పాల్గొన్నారని నిలదీశారు. ఆమెకు ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదన్నారు.

సీబీఐ విచారణ ఎందుకు వద్దంటున్నారు...

వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన కుటుంబసభ్యులే హత్య చేశారన్నారు. వివేకా హత్య(viveka murder)ను.. ఆ పార్టీలోని కొందరు నేతలు గుండెపోటుగా చూపించే ప్రయత్నం ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ (CBI) విచారణ అడిగిన జగన్.. ఇప్పుడు ఎందుకు స్పందించటంలేదని ఆక్షేపించారు.

ఇదీ చదవండి: రేషన్ కార్డు పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిశీలించాలి: మంత్రి గంగుల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.