భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వేదికగా గురువారం స్వర్ణోత్సవ విజయ్ దివస్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు బ్రిగేడియన్ జె.జె.ఎస్.బిందార్ పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ గిరీషతో కలిసి మాట్లాడారు.
1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తిరుపతి నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు మాజీ సైనికులను ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా పండుగలా కేసీఆర్ జన్మదిన వేడుకలు