ETV Bharat / city

VIJAYAWADA DURGA: విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం - విజయవాడ దుర్గమ్మకు ఇవాళ బంగారు బోనం సమర్పణ వార్తలు

హైదరాబాద్‌ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనుంది. ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా ఘాట్ రోడ్డు నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వరకు కళాకారులతో బోనాల జాతర ఊరేగింపు జరగనుంది.

VIJAYAWADA DURGA: విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం

author img

By

Published : Jul 18, 2021, 7:05 AM IST

హైదరాబాద్‌ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనుంది. బోనంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించేందుకు కమిటీ సభ్యులు విజయవాడ చేరుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ నిబంధనల ప్రకారం కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత పన్నెండేళ్ల నుంచి దుర్గమ్మకు బోనాలు సమ్పరిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది.

ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా ఘాట్ రోడ్డు నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వరకు కళాకారులతో బోనాల జాతర ఊరేగింపు జరగనుంది. కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబతో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని బంగారు బోనాలు తీసుకొస్తున్న వారికి ఆహ్వానం పలకనున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణలో నేటి నుంచి థియేటర్లు ఓపెన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.