ETV Bharat / city

తవ్వకాల్లో బయటపడిన... బంగారు గరుడ యంత్రం, రాగి నాణేలు..

COPPER COINS: ఏపీలోని సింహాచల దేవస్థాన ఉపదేవాలయమైన రామాలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే... ఇందుకోసం జరిపిన తవ్వకాల్లో ధ్వజస్తంభం అడుగు భాగంలో బంగారంతో తయారు చేసిన గరుడ యంత్రం, 112 రాగి నాణేలు, రాగితో తయారు చేసిన నమూనా ధ్వజస్తంభ పత్రాలు లభ్యమయ్యాయి.

COPPER COINS
COPPER COINS
author img

By

Published : Jun 3, 2022, 2:22 PM IST

COPPER COINS: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా సింహగిరిపై ఉన్న సింహాచల దేవస్థాన ఉపదేవాలయమైన రామాలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. ధ్వంసమైన ధ్వజస్తంభాన్ని తొలగించే పనులు చేపట్టారు. ఆలయ ఈవో సూర్యకళ ఆధ్వర్యంలో... ఈ పనులు జరుగుతున్నాయి. అయితే.. ఈ తవ్వకాల్లో ధ్వజస్తంభం అడుగు భాగంలో బంగారంతో తయారు చేసిన గరుడ యంత్రం, 112 రాగి నాణేలు, రాగితో తయారు చేసిన ధ్వజస్తంభ నమూనా పత్రాలు లభ్యమయ్యాయి.

రెవెన్యూ అధికారులు.. పోలీసులు, దేవస్థాన సిబ్బంది, భక్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి.. లభ్యమైన వస్తువులను భద్రపరిచారు. ఈ నెల 9వ తేదీన ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది.

ఇవీ చదవండి:మాజీ ప్రియుడే కదా అని పర్సనల్​ ఫొటోలు పంపితే...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.