Shamshabad Airport: 45 ఎకరాల విస్తీర్ణం.. 30 వేలకు పైగా సౌరపలకలు.. వాటి సాయంతో 10 మెగావాట్ల విద్యుదుత్పత్తి... వెరసి నెలకు ఆదా అయ్యే సొమ్ము సుమారు రూ.90 లక్షలు.. ఇది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఘనత. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50 శాతం కరెంటు అవసరాలు ఇక్కడి సోలార్ ప్యానెళ్ల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తు ద్వారానే తీరుతున్నాయి. సంస్థ ప్రాంగణంలో 2015లో 5 మెగావాట్ల సామర్థ్యంతో మొదటి ప్లాంటు ప్రారంభమైంది. అంతే స్థాయిలో రెండోది 2021లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్ ప్లాంటు నుంచి 10 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే క్రమంలో 28 లక్షల కిలోల బొగ్గుపులుసు వాయువు(కార్బన్ డయాక్త్సెడ్) వెలువడుతుంది. ఇపుడు విమానాశ్రయంలో అంతే మొత్తం విద్యుత్‌ను సౌర పలకల రూపేణా ఉత్పత్తి చేయటం ద్వారా ఆ కాలుష్యాన్నంతా కట్టడి చేసినట్లయ్యింది. పర్యావరణ పరిరక్షణ పరంగా ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. క్లీన్ ఎనర్జీ దిశగా మరో మైలురాయిని చేరుకుంది.
ఇవీ చదవండి: