ETV Bharat / city

చంపేశారు.. విజయవాడ చిన్నారి ద్వారక ఇక లేదు! - చిన్నారి ద్వారక ఇక లేదు

విజయవాడలో దారుణం జరిగింది. భవానీపురంలో అపహరణకు గురైన చిన్నారి ద్వారకను హత్య చేశారు. ఇంటి సమీపంలోని సంచిలో మూటకట్టి పడి ఉన్న బాలిక మృతదేహాన్ని అక్కడివారు గుర్తించారు. ఆదివారం ఆడుకుంటుండగా అదృశ్యమైన బాలిక ద్వారక.. ఇలా చనిపోయి కనిపించడం.. బాధిత కుటుంబంతో పాటు, స్థానికులను తీవ్ర విషాదంలో ముంచింది.

girl-murder-in-vijayawada
author img

By

Published : Nov 11, 2019, 8:45 PM IST

చంపేశారు.. విజయవాడ చిన్నారి ద్వారక ఇక లేదు!

చిత్తూరు జిల్లాలో ఐదేళ్ల చిన్నారి హత్యోదంతంపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో... అలాంటి ఉదంతమే విజయవాడ నగర శివారులో వెలుగు చూసింది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి ఆడుకునేందుకు బయటకు వెళ్లిన ఎనిమిదేళ్ల చిన్నారి... ఈ రోజు ఇంటి సమీపంలోని ఓ గోనె సంచిలో మృతదేహమై కనిపించింది. తమ నివాసానికి దగ్గరలోని ఇంట్లో ఉండే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భవానీపురం పోలీసు స్టేషను పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి సమీపంలోని నల్లకుంట ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల మువ్వా ద్వారక.. నిన్న సాయంత్రం అదృశ్యమైంది. పాప కనిపించడం లేదంటూ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సెయింట్‌పాల్స్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ద్వారక రెండో తరగతి చదువుతుండగా... తండ్రి అనీల్‌ మద్యం గోదాములో, తల్లి ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారు. భవానీపురం పోలీసులు రెండు బృందాలుగా ఉదయం నుంచి దర్యాప్తు చేపట్టారు. విజయవాడలో విస్తృతంగా తనిఖీలు చేయించారు.

సీసీ కెమెరాల్లో దృశ్యాలు ఏమైనా రికార్డు అయ్యాయా? అనే విషయంపైనా పరిశీలన చేయించారు. డ్రోన్‌ కెమెరాతో గాలించారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో చిన్నారి ద్వారక మృతదేహం ఆమె ఇంటికి సమీపంలో గోనె సంచులో కుట్టేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శరీరాన్ని పూర్తిగా మడత పెట్టి సంచిలో కుక్కేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ దారుణానికి పాల్పడింది... ద్వారక ఇంటికి సమీపంలో అద్దెకు నివాసం ఉంటోన్న 45 ఏళ్ల ప్రకాష్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి ఆ తర్వాత హత్య చేశాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.