ETV Bharat / city

GHMC Ward Volunteer Committees : జీహెచ్​ఎంసీలో వార్డు వాలంటీర్ కమిటీలు

GHMC Ward Volunteer Committees : భాగ్యనగరాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు జీహెచ్​ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి వార్డుకు 100 మంది చొప్పున స్వచ్ఛంద సేవకులను నియమించేందుకు రంగం సిద్ధం చేసింది. వారంతా వార్డు సభ్యుల హోదాలో పనిచేయనున్నారు. వార్డు వాలంటీర్ల కమిటీలు శక్తివంతమైన అస్త్రంగా పనిచేస్తాయని జీహెచ్​ఎంసీ పేర్కొంది.

GHMC Ward Volunteer Committees
GHMC Ward Volunteer Committees
author img

By

Published : Dec 16, 2021, 11:01 AM IST

GHMC Ward Volunteer Committees : నగరాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి వార్డుకు 100 మంది చొప్పున స్వచ్ఛంద సేవకులను నియమించేందుకు రంగం సిద్ధం చేసింది. చట్ట ప్రకారం.. వారంతా వార్డు సభ్యుల హోదాలో పనిచేయనున్నారు. నగరంలోని 150 వార్డులకు కలిపి మొత్తం 15 వేల మంది వార్డు సభ్యులు ఉండనున్నారు. వాళ్లను ఎన్నుకునేందుకు త్వరలో జీహెచ్‌ఎంసీ నోటిఫికేషన్‌ విడుదల చేయబోతోంది. అందులో భాగంగా బల్దియా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.

Ward Volunteer Committees in GHMC : ఒక్కో వార్డుకు నాలుగు రకాల కమిటీలు, ప్రతి కమిటీలో పాతిక మంది సభ్యులు, మొత్తం సభ్యుల్లో సగం మహిళలు ఉండేట్లు గతేడాది అక్టోబరులో జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణ చేసిన విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ప్రతి వార్డుకు నాలుగు రకాల వార్డు వాలంటీర్ల కమిటీలను ఏర్పాటు చేయబోతున్నామని, త్వరలో విధివిధానాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన విధివిధానాలు ఇటీవల జీహెచ్‌ఎంసీకి అందాయి. వాటిపై అధికారులు కసరత్తు చేసి, ఎంపికకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్డు వాలంటీర్ల కమిటీలు శక్తివంతమైన అస్త్రంగా పనిచేస్తాయని జీహెచ్‌ఎంసీ గుర్తుచేస్తోంది. పాలనలో స్థానికులను, నిపుణులను, అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించింది.

కమిటీల స్వరూపం, అధికారాలు ఇలా ఉండనున్నాయి..

  • వార్డు కమిటీలు నాలుగు రకాలు.. యువత, మహిళ, వయోవృద్ధులు, ప్రముఖులకు వేర్వేరుగా కమిటీలుంటాయి. ప్రతి కమిటీలో 25 మంది సభ్యులు. అంటే.. మొత్తంగా ఒక్కో వార్డుకు 100 మంది. వారంతా స్వచ్ఛందంగా వార్డు అభివృద్ధికి పనిచేయాల్సి ఉంటుంది. సభ్యుల్లో సగం మహిళలే ఉండాలి. సభ్యుల పదవీ కాలం ఏడాది మాత్రమే. అనంతరం.. అదే వార్డులోని ఇతర సభ్యులతో జీహెచ్‌ఎంసీ నోటిఫికేషన్‌ ద్వారా కమిటీ నియామకమవుతుంది.
  • ప్రతి మూడు నెలలకోసారి వార్డు కమిటీలు సమావేశమవుతాయి. వార్డులోని సమస్యలను చర్చించి జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం దృష్టికి తీసుకెళ్లొచ్చు.
  • పారిశుద్ధ్యం, గణ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై వార్డు కమిటీలు ఫిర్యాదులు, సిఫార్సులు చేయొచ్చు. మొక్కలు నాటడం, హరితహారం, ప్రజా మరుగుదొడ్లు, వీధి లైట్లు, మార్కెట్లు, ఖాళీ స్థలాలు, పన్ను వసూళ్లు, బకాయిలు, రుసుముల వసూలు, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై గళమెత్తొచ్చు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించే కార్యక్రమాలు, ఆటపాటలు, క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలను ప్రోత్సహించడంలో వారికి అధికారం ఉంటుంది.
  • జీహెచ్‌ఎంసీ పద్దులోని 10 శాతాన్ని హరిత పద్దుగా కేటాయిస్తారు. వార్డుకు ప్రత్యేకంగా నర్సరీ ఏర్పాటు, వాటిలో మొక్కల పెంపకం, నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా చూసే బాధ్యత మేయర్, కార్పొరేటర్, అధికారులపైనే గాక, వార్డు సభ్యులపైనా ఉంటుంది. సమాంతరంగా జోనల్‌ కమిషనర్లు పచ్చదనం పర్యవేక్షణకు ప్రతి వార్డుకు ఓ నోడల్‌ అధికారిని నియమిస్తారు. నాటిన మొక్కలు 85 శాతం బతకకపోతే.. కమిషనర్‌ వాళ్ల సభ్యత్యాన్ని రద్దు చేయొచ్చు.
  • ఇదీ చదవండి : GHMC News : జీహెచ్​ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. 9 అంశాలకు ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.