వసూళ్లు ఇలా...
జీహెచ్ఎంసీ నివాస భవనాలు యజమానుల నుంచి రూ. 461.83 కోట్లు, వాణిజ్య భవనాల నుంచి రూ. 778.70 కోట్లు సేకరించింది. ఆస్తి పన్ను ద్వారా రూ. 160.47 కోట్లు లభించాయి. ప్రధానంగా పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా గణనీయమైన ఆదాయం వచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ద్వారా రూ. 41.36 కోట్లు, అడ్వటైజ్మెంట్ ఫీజు కింద రూ. 31.84 కోట్లు వసూలయ్యాయి. ఎన్నికల విధుల్లో తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ గతేడాదికి మించి ఆస్తిపన్ను సేకరించడంపై కమిషనర్ దాన కిశోర్ అధికారులను అభినందించారు.
ముందుగా చెల్లించేవారికి ఎర్లీబర్డ్
ప్రస్తుత ఆర్థిక ఏడాది ఆస్తిపన్నును ఏప్రిల్ మాసంలో ముందస్తుగా చెల్లించేవారికి ఎర్లీబర్డ్ పథకం ప్రకటించింది. ఏప్రిల్ 6 నుంచి 30 లోపు పన్ను చెల్లించేవారికి 5 శాతం రిబేట్ ఇవ్వనున్నట్లు కమిషనర్ ప్రకటించారు. ఈ రాయితీ కేవలం ఈ ఆర్థిక సంవత్సరానికే పరిమితమని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని అన్ని సిటిజన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా, ఈ సేవా కేంద్రాల్లో పన్ను చెల్లించవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ ఎంపిక చేసిన బ్యాంక్‌లలో, మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్ ద్వారా చెల్లింపునకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 7 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు.
ఇదీ చదవండి :కాంగ్రెస్ అధికారిక పేజీలు తొలగించిన ఫేస్బుక్!