హైదరాబాద్ నగర పాలకసంస్థలో పలువురు అధికారులను బదిలీచేస్తూ కమిషనర్ దానకిషోర్ ఉత్తర్వులు జారీచేశారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ సి.ఎన్. రఘుప్రసాద్‌ను గవర్నర్ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా, మూసాపేట్ డిప్యూటీ కమిషనర్ వి. మమతను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ జె.శంకరయ్యను తదుపరి పోస్టింగ్ నిమిత్తం కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మూసాపేట్ ఏఎంసీ శెర్లీ పుష్యరాగంను చాంద్రాయణగుట్ట సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా, చాంద్రాయణగుట్ట డిప్యూటీ కమిషనర్ మోహన్‌రెడ్డిని మూసాపేట్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి: ' ఉద్యోగులు నిబద్ధతతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి '