గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత ఈనెల 22న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 9.30కు తమ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బాధ్యతలు స్వీకరిస్తారు.
ఈనెల 11న జరిగిన మేయర్ ఎన్నికల్లో గ్రేటర్ పీఠాన్ని ఇద్దరు మహిళలు దక్కించుకున్నారు. ఎంఐఎం మద్దతుతో కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్గా, మోతె శ్రీలత ఉపమేయర్గా ఎన్నికయ్యారు. ఒకేసారి ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని... అన్ని పార్టీల సభ్యులను కలుపుకుని నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళతానని విజయలక్ష్మి తెలిపారు.
- ఇదీ చూడండి : అభివృద్ధే లక్ష్యం... బల్దియా పీఠమెక్కిన మహిళామణులు