కరోనా వల్ల జీహెచ్‌ఎంసీలో పాలన, పౌర సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా జనన, మరణ ధ్రువపత్రాల జారీ నుంచి ఇంటి నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, వీధిలైట్లు, రోడ్లపై గుంతలు, నాలాల సమస్య, ఆస్తిపన్ను వివాదాలు, మ్యుటేషన్లు, ట్రేడ్ లైసెన్సుల వరకు పలు సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందట్లేదు. డిజిటల్ సేవలను విస్తరించడమే పరిష్కారమని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
మైజీహెచ్‌ఎంసీ యాప్‌తో..
కరోనా వ్యాప్తికి ముందు చాలా మంది అధికారులు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సందర్శకులను అనుమతించేవారు. ఇప్పుడు కుదరదని చెబుతున్నారు. వారి ఆందోళనలో నిజం ఉన్నప్పటికీ.. పౌర సేవల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గమేంటో అధికారులు చెప్పాలి. ఇదే విషయమై ఉన్నతాధికారులను ప్రశ్నించగా.. ప్రజావాణి, సందర్శకుల సమయాల్లో వీడియో కాన్ఫరెన్సు తరహా కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవాలన్నారు.
ఫిర్యాదులను కాల్‌సెంటరు, మైజీహెచ్‌ఎంసీ మొబైల్ యాప్ ద్వారా స్వీకరించి, పరిష్కరించాల్సి ఉందన్నారు. అధికారిని నేరుగా కలిసి సమస్య వివరిస్తేనే పరిష్కారం దొరుకుతుందన్న భావన నుంచి పౌరులు బయటపడాలని, అదే సమయంలో అధికారులు మరింత బాధ్యతగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
- ఇదీ చూడండి... మోదీ 2.0: తొలి ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది...