ETV Bharat / city

వైరస్​ వ్యాప్తి అడ్డుకునేందుకు బల్దియా నిర్ణయం - మేడ్చల్‌

నగరంలో కరోనా సోకిన వ్యక్తులు ఎక్కువున్న 12 ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ బుధవారం కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకోవాలని యంత్రాంగానికి స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌తో చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని కమిషనర్‌ తెలిపారు.

containment clusters
కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు
author img

By

Published : Apr 9, 2020, 10:51 AM IST

నగరంలో 175 కరోనా కేసులు ఉండగా.. 12 ప్రాంతాల్లోనే 89 మంది వైరస్‌ బారినపడ్డారు. వదిలేస్తే పరిస్థితి చేజారుతుందని ఆ ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోనూ 3ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించారు.

అక్కడ ఏం చేస్తారు?

  • ప్రతి ఇంటిని వైద్యఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ, సంబంధిత విభాగాలు తనిఖీ చేస్తాయి.
  • సర్వే చేసి, వ్యాధి లక్షణాలున్న వారిని ఆస్పత్రికి తరలిస్తారు. వైరస్‌ సోకితే ఐసోలేషన్‌ లేదా నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారు.
  • అక్కడున్న ప్రతి వీధిని శుభ్రంగా ఊడ్చి, క్రమం తప్పక క్రిమి సంహారకాలు పిచికారీ చేస్తారు. నిత్యం పర్యవేక్షిస్తారు.
  • ఆ ప్రాంతాల్లోని వ్యక్తులు బయటకు వెళ్లకుండా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేస్తారు.

ఎప్పటికప్పుడు జియోట్యాగ్‌..

గత నెల దిల్లీకి వెళ్లొచ్చినవారు ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే 593 మంది ఉన్నారు. వారిలో 83 మందికి వైరస్‌ సోకింది. వారి ద్వారా మరో 51 మందికి వ్యాపించింది. వేర్వేరు మార్గాల్లో మరో 70మందికి సోకింది. వీరందరి నివాస ప్రాంతాలను అధికారులు ప్రభుత్వ యాప్‌లో జియోట్యాగ్‌ చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో బుధవారం నాటికి 659 మంది నివాసాలను జియోట్యాగ్‌ చేశారు.

కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు ఇవే

  1. రాంగోపాల్‌పేట షేక్‌పేట
  2. రెడ్‌ హిల్స్‌
  3. మలక్‌పేట - సంతోష్‌నగర్‌
  4. చాంద్రాయణగుట్ట
  5. అల్వాల్‌
  6. మూసాపేట
  7. కూకట్‌పల్లి
  8. కుత్బుల్లాపూర్‌ - గాజులరామారం
  9. మయూరినగర్‌
  10. యూసుఫ్‌గూడ
  11. చందానగర్‌
  12. బాలాపూర్‌
  13. చేగూరు

ఇవీ చూడండి: కేజీ టూ పీజీ.. అందరికీ ఆన్​లైన్​ పాఠాలేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.