రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుంచి ధ్రువపత్రం పొందినవారు మాత్రమే జీహెచ్ఎంసీ పరిధిలో పెంపుడు జంతువుల విక్రయం చేపట్టాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. ఈ ధ్రువపత్రాలు తీసుకునేందుకు దుకాణ నిర్వాహకులకు నాలుగు వారాల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. అప్పటికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రేటర్ పరిధిలో సుమారు 70 పెట్ దుకాణాలున్నాయని... ఏ ఒక్కదానికి జీహెచ్ఎంసీ నుంచి పొందిన ట్రేడ్ లైసెన్స్ తో పాటు రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుంచి పొందిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదని వెల్లడించారు. తదనుగుణంగా అన్ని పెట్ దుకాణాలకు నోటీసులు జారీ చేయాలని జీహెచ్ఎంపీ కమిషనర్, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సంచాలకులను ఆదేశించారు. పెంపుడు జంతువుల సంరక్షణ, అటువంటి షాపుల నిర్వహణలో ఈ చట్టం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఇదీ చూడండి: WEATHER REPORT: హైదరాబాద్లో రాత్రి నుంచి భారీవర్షం