రికార్డు స్థాయిలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు జీహెచ్ఎంసీకి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 1401 కోట్లకు పైగా ఆస్తి పన్నును సేకరించడంలో ప్రతిభ చూపిన అధికారులకు అభినందన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, రెవెన్యూ విభాగం అడిషనల్ కమిషనర్ అద్వైత్కుమార్ సింగ్, అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత పన్నుల విధానాన్ని మార్చకుండా అంతర్గత లోపాలను సవరించడం ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవచ్చని కమిషనర్ అన్నారు. గత ఆరు నెలలుగా ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ పన్నుల సేకరణలో ఉత్తమ ఫలితాలు పొందడం జీహెచ్ఎంసీ అధికారుల నిబద్ధతకు నిదర్శనమని దానకిషోర్ ప్రశంసించారు.ఇదీ చదవండి :దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి: కేటీఆర్