ETV Bharat / city

శ్రీశైలం ఘటన: అర్ధరాత్రి వరకు బ్యాటరీలు బిగింపా..! - జెన్​కో అంత‌ర్గ‌త క‌మిటీ విచార‌ణ ప్రారంభం

శ్రీశైలం జల విద్యుత్​ కేంద్రంలో అగ్నిప్రమాదంపై జెన్​కో అంతర్గత కమిటీ విచారణ జరుపుతోంది. ఘటనా స్థలంలో పలు వివరాలను సేకరించింది. బాధితులకు నిర్వహించిన సంతాప సభలో పలువురు వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రమాదానికి జెన్​కో ఉన్నతాధికారి నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు.

srisailam power plant fire accident
శ్రీశైలం ఘటన: అర్ధరాత్రి వరకు బ్యాటరీలు బిగింపా..!
author img

By

Published : Aug 26, 2020, 7:28 AM IST

శ్రీశైలం జ‌లవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్ర‌మాదంపై జెన్​కో అంత‌ర్గ‌త క‌మిటీ విచార‌ణ ప్రారంభించింది. మంగ‌ళ‌వారం.. విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్ల‌ను నిశితంగా ప‌రిశీలించింది. నాలుగో యూనిట్​కు భారీగా న‌ష్టం వాటిల్లిందని... ఆరో యూనిట్​లోని ప్యానెల్ బోర్డు పూర్తిగా కాలిబూడిదైంద‌ని నిపుణుల క‌మిటీ గుర్తించింది. ఒక్కో విభాగంలో పూర్తిగా తిరుగుతూ అన్ని వివ‌రాలను సేక‌రించింది. ఘ‌ట‌నాస్థ‌లంలో ఇంజ‌నీర్లు, ఉద్యోగులు, బ్యాట‌రీలు బిగించే వాళ్లు మృతిచెందిన ప్ర‌దేశాన్ని.. నిశితంగా పరిశీలించింది. ఆరు ట్రాన్స్​ఫార్మర్లు, ఆరు జనరేటర్లను క్షుణ్ణంగా పరిశీలన చేసింది.

అప్పుడే విద్యుత్​ ఉత్పత్తి..

ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు ప్లాంట్ ట్రిప్ కాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలను ఎస్పీడీసీఎల్​ ఛైర్మన్​ రఘుమారెడ్డి, వెంక‌టరాజం, జ‌గ‌త్ రెడ్డి, స‌చ్చితానందం బృందం.. ఆరా తీసింది. 1,2,3,5 యూనిట్ల‌లో పెద్ద‌గా ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని.. వాటిని 30 నుంచి 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చి.. విద్యుదుత్పత్తి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది.

భారీగా ఊటనీరు..

విద్యుత్ కేంద్రంలోకి భారీగా ఊట‌నీరు వ‌స్తుంది. 10 హెచ్​పీ మోటార్ల‌ు, నాలుగు 15 హెచ్​పీ మోటార్ల‌ను ఏర్పాటు చేసి నీటిని బ‌య‌ట‌కు ఎత్తిపోస్తున్నారు. బుధ‌వారం మ‌రో 80హెచ్​పీ పంపును కూడా ఏర్పాటుచేస్తామ‌ని జెన్​కో కమిటీ తెలిపింది. ఈ పంపుతో వేగంగా నీటిని బ‌య‌ట‌కు పంపించే అవ‌కాశం ఉంటుంద‌ని అభిప్రాయపడుతోంది. నీరు తొల‌గిస్తేనే ప్లాంట్​ పునరుద్ధరణ ప‌నులు త్వ‌రిత‌గ‌తిన జ‌రుగుతాయ‌ని అధికారులు తెలిపారు.

వ్యాఖ్యల కలకలం..

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదం కేవలం ఒకరిద్దరు అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని పలువురు ప్రజాప్రతినిధులు ఆరోపించారు. విద్యుత్​ కేంద్రం సమీపంలో నిర్వహించిన సంతాప సభలో నివాళులు అర్పించారు. ఈ స‌భ‌లో జెన్​కో నియమించిన నిపుణుల కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, విద్యుత్ సంఘాల నేత‌లు మాట్లాడిన మాట‌లు క‌ల‌క‌లం సృష్టించాయి.

పరిహారం పెంచండి..

జెన్​కో లోని ఓ ఉన్నతాధికారి నిర్లక్ష్యం వల్లనే ఘటన జరిగిందని ఆరోపించారు. అర్ధరాత్రి వరకు బ్యాటరీల బిగింపు ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ సంతాప సభలో నిలదీశారు. ఆరో యూనిట్​లో బ్యాట‌రీలు బిగిస్తున్న సందర్భంగా ప్యానెల్ బోర్డులో విద్యుదాఘాతం జరిగి.. జ‌న‌రేట‌ర్ల‌ను నియంత్రించే సెన్సార్​కు నేరుగా విద్యుత్ స‌ర‌ఫ‌రా కాక‌పోవ‌డం వల్లనే లోడ్ పెరిగి మంట‌లు అంటుకున్నట్లు అనుమానం వ్య‌క్తం చేశారు. విచార‌ణ నిష్ప‌క్ష‌పాతంగా జరగాలని.. పరిహారాన్ని మరింత పెంచాలని విద్యుత్​ ఉద్యోగుల సంఘాల నేతలు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

ఇవీచూడండి: శ్రీశైలం ప్రమాదంపై లోతుగా సీఐడీ విచారణ

మానవ తప్పిదమా లేదా షార్ట్‌సర్క్యూటా.. అసలేం జరిగింది?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.