ETV Bharat / city

చిలుకూరులో 18 గంటలు భగవద్గీత పారాయణం

చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా 18 గంటల పాటు భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు.

geeta-parayanam-in-chilukuru-balaji-temple-in-hyderabad
చిలుకూరులో 18 గంటలు భగద్గీత పారాయణం
author img

By

Published : Dec 8, 2019, 10:02 AM IST

Updated : Dec 8, 2019, 11:13 AM IST

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో గీత జయంతిని పురస్కరించుకుని శనివారం రోజున లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18 గంటల పాటు భగవద్గీత పారాయణం నిర్వహించారు. కుందన మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు ఆలపించిన గాన కచేరీ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక సంఖ్యలో భక్తులు, చిన్నారులు పాల్గొని ఫౌండేషన్ వారు అందించిన ఉచిత భగవద్గీత పుస్తకాల్ని పారాయణం చేశారు.

హిందూ ధర్మాన్ని, హిందూ దేశాన్ని రక్షించే ఉత్తమ సైనికులుగా తయారవ్వాల్సిన అవసరం ఉందని చిన్నారులకు ప్రధానార్చకుడు రంగరాజన్​ కర్తవ్య బోధన చేశారు. ఈ గీతా పారాయణం ఉదయం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటలకు ముగిసింది.

చిలుకూరులో 18 గంటలు భగద్గీత పారాయణం

ఇదీ చూడండి: యువతుల్లో అభద్రతా భావంపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు

Intro: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం
చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా 18 గంటల పాటు అఖండ శ్రీమద్ భగవద్గిత పారాయణ కార్యక్రమం*
Body:*చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా 18 గంటల పాటు అఖండ శ్రీమద్ భగవద్గిత పారాయణ కార్యక్రమం*

రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం లోని చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణంలో గీత జయంతి సందర్భంగా లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18 గంటల అఖండ శ్రీమద్ భగవద్గీత పారాయణం నిర్వహించారు...ఈ కార్యక్రమంకి ముఖ్యఅతిథిగా చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్ విచ్చేసారు చిలుకూరు సర్పంచ్ స్వరూప అండ్రు అప్పోజి గూడ సర్పంచ్ గోరకంటి రాజు మరియు కాశీ సిస్టర్స్ శ్రీమతి కవితా తిరుమలేష్ పాల్గొన్నారు..
కుందన మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన గాన కచేరీ కార్యక్రమం ఘనంగా సాగుతుంది ఈ కార్యక్రమం లక్ష్య సాధన ఫౌండేషన్ చైర్మన్ రాజు ఆధ్వర్యంలో జరుగుతుంది..

*ఉదయం 5 గంటల 18 నిమిషాల నుండి ప్రారంభమై రాత్రి 11గంటల 18 నిమిషాల వరకు కొనసాగనుంది*

ఈ భూమండలం పైన కృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడిని ఆధారం చేసుకొని సమస్త మానవ జాతికి మార్గదర్శనం రూపంలో భగవద్గీతను చెప్పిన రోజు ఈరోజు ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రాంగణంలో లక్ష్యసాధన ఫౌండేషన్ రెండవసారి అఖండ భగవద్గీత పారాయణం చేయడం జరిగింది చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక సంఖ్యలో భక్తులు పాల్గొని ఫౌండేషన్ వారు అందించిన ఉచిత భగవద్గీత పుస్తకాల్ని పొంది పారాయణం చేయడం జరిగింది శివ సాయి స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు...

ముఖ్యఅతిథిగా చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కృష్ణుని అదర్శం చేసుకొని నిరంతరం ఆదర్శం తీసుకుని నిరంతరం జీవితంలో అనుసరిస్తూ అర్జునుడి లాగా అన్ని రంగాలలో ముందు మనం పుట్టిన హిందూ ధర్మాన్ని హిందూ దేశాన్ని రక్షించే ఉత్తమ సైనికులుగా సేవలు అందించే ఉత్తమ సేవకులుగా తయార్ అవ్వాల్సిన అవసరం ఉందని కర్తవ్య బోధన చేశారు దిశ కేసులో దేవుని అనుగ్రహం వలన అన్యాయం జరగకుండా ఆలస్యమైనా న్యాయం జరిగిందని గుర్తు చేశారు.....Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల , సుభాష్ రెడ్డి,9866815235
Last Updated : Dec 8, 2019, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.