కొత్త రెవెన్యూ విధానంలో భాగంగా భూ హక్కులు-పట్టాదారు పాసుపుస్తకాల చట్టంతోపాటు వీఆర్వో వ్యవస్థ రద్దు చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో ఉభయసభల ఆమోదం పొందిన బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదంతో చట్టాలుగా మారాయి. ఈ మేరకు చట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నెల 19న గెజిట్ నోటిఫికేషన్లు ప్రచురించారు. అందుకు అనుగుణంగా న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌బీపాస్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల, పురపాలక, పంచాయతీరాజ్, జీఎస్టీ సవరణ చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా అమలు నిబంధనలను ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.