ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుండడంతో ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహించే గరుడ సేవను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ నెల 28న పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ జరగాల్సి ఉంది.
'ఈ ఏడాది తుంబుర తీర్థంకు అనుమతి లేదు'
ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున తుంబుర తీర్థ ముక్కోటిని తితిదే వైభవంగా నిర్వహిస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో గల ఈ తీర్థానికి తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది తుంబుర తీర్థానికి భక్తులకు అనుమతి నిలిపివేయాలని తితిదే నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: యాదాద్రి ఆలయంలో 30 మందికి కరోనా పాజిటివ్