మధ్యప్రదేశ్ నీముచ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 30ఏళ్ల మహిళా కానిస్టేబుల్‌పై ముగ్గురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఈ దృశ్యాలను చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన ఈ నెల తొలి వారంలో జరిగింది. 13న బాధితురాలు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టారు పోలీసులు. అనంతరం ప్రధాన నిందితుడు, అతని తల్లి సహా మొత్తంగా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు.
మహిళా కానిస్టేబుల్‌కు నిందితుడు ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. ఏప్రిల్ నుంచి వాట్సాప్‌లో చాట్ చేసుకుంటున్నారు. తన సోదరుడి పుట్టిన రోజుకు ఆమెను ఆహ్వానించాడు. అక్కడికి ఆమె వెళ్లగా.. ఆ వ్యక్తి, అతని సోదరుడు, మరో వ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వీడియోను అడ్డం పెట్టుకుని.. తన నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రధాన నిందితుడి తల్లి ప్రయత్నించిందని బాధితురాలు ఆరోపించింది. పూర్తి వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి: Son killed mother: పింఛను పైసల కోసం కన్న తల్లినే కిరాతంగా చంపేశాడు