ETV Bharat / city

Vinayak chaturthi 2021: సెప్టెంబర్‌ 10 నుంచి గణేశ్​ ఉత్సవాలు.. - సెప్టెంబర్‌ 10 నుంచి గణేష్‌ ఉత్సవాలు..

సెప్టెంబర్‌ 10 నుంచి వినాయక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని గణేశ్​ ఉత్సవ కమిటీ తెలిపింది. 19 తేదీన నిమజ్జనం ఉంటుందని వెల్లడించింది. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రధాన కార్యదర్శి వివరించారు.

Ganesh chaturthi 2021 celebrations start from september 10 Committee

author img

By

Published : Jul 17, 2021, 4:16 PM IST

సెప్టెంబర్‌ 10వ తేదీన వినాయక ఉత్సవాలు(Vinayak chaturthi 2021) ప్రారంభమవుతాయని భాగ్యనగర్‌ గణేశ్​ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు వెల్లడించారు. సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం రోజు గణేష్ నిమజ్జనం ఉంటుందని తెలిపారు. గణేశ్​ ఉత్సవాలకు సంబంధించిన ముడిసరుకును సమయానికి అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు.

గణేశ్​ ఉత్సవాలకు 24 రకాల మెడిసినల్‌ ప్లాంట్స్‌ ఉపయోగిస్తున్నట్లు భగవంతరావు పేర్కొన్నారు. నిమజ్జన సమయానికి రోడ్లు బాగుండేలా చేయాలని జీహెచ్‌ఎంసీని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కరోనా మార్గదర్శకాల ప్రకారంగా మండపాల్లో అన్ని జాగ్రత్తలు చేపడతామని స్పష్టం చేశారు. మండపాల్లో దేశభక్తి, దైవభక్తి పాటలు మాత్రమే ఉండాలని సూచించారు. గణేశ్​ విగ్రహం ఎత్తు కోసం పోటీ పడకుండా... కరోనా గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ జాగ్రత్తగా వేడుకలు చేసుకోవాలని తెలిపారు. గతేడాది మాదిరిగానే నిమజ్జన సమయంలో అందరూ భౌతికదూరం పాటించాలని భగవంత్​రావు కోరారు.

ఇదీ చూడండి: Viral: నవ్వులు పూయిస్తున్న 'పిల్లకోతి' చేష్టలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.