హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కొత్త పాలకవర్గం కొలువుతీరింది. మేయర్‌గా బంజారాహిల్స్ తెరాస కార్పొరేటర్ , సీనియర్ నేత కె. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. ఉప మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత విజయం సాధించారు. మరోసారి అధికార పార్టీకి మజ్లిస్ పార్టీ అండగా నిలిచింది. సరైన బలం లేకపోవడంతో మేయర్, ఉపమేయర్ కోసం భాజపా పోటీపడినా ఓటమి చవిచూసింది.
మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి..
మేయర్‌గా అధికార తెరాస తరపున బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మీని మేయర్‌గా తెరాస నియమించింది. మేయర్‌గా విజయలక్ష్మీ పేరును..... మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ప్రతిపాదించగా... గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి మద్దతు తెలిపారు. మేయర్ అభ్యర్థిగా అర్కేపురం డివిజన్ అభ్యర్థి వీరన్నగారి రాధను భాజపా నిలబెట్టింది. మైలార్ దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా.. వినాయక నగర్ డివిజన్ అభ్యర్థి రాజ్యలక్ష్మీ మద్దతు తెలిపారు. ఆ తర్వాత మేయర్ ఎన్నికను రిటర్నింగ్ అధికారి శ్వేతా మహంతి నిర్వహించారు. అందులో విజయలక్ష్మీకి ఎక్కువ ఓట్లు రావడంతో విజయలక్ష్మీ అధికారికంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత..
ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నికను చేపట్టారు. తార్నాక డివిజన్ అభ్యర్థిగా మోతె శ్రీలతా రెడ్డిని అధికార తెరాస బరిలో నిలిపింది. మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్ జితెందర్ నాథ్.. శ్రీలతా రెడ్డిని ప్రతిపాదించగా..కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన జూపల్లి సత్యనారాయణ మద్దతు తెలిపారు డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా.. బేగంబజార్ కార్పొరేటర్ కార్పొరేటర్ శంకర్ యాదవ్‌ను భాజపా బరిలో నిలిపింది. ఆయనకు రాకేశ్ జత్వాల్... అడిక్ మేట్ డివిజన్ శ్వేతా ప్రకాశ్ గౌడ్ మద్దతు తెలిపారు.
ఉప మేయర్‌కు రెండు నామినేషన్లు
డిప్యూటీ మేయర్ పోటీకి రెండు నామినేషన్లు వచ్చినట్లు తెలిపిన రిటర్నింగ్ అధికారి శ్వేతా మహంతి ఎన్నిక ప్రకియను చేపట్టారు. అందులో తెరాస అభ్యర్థి మోత శ్రీలతా రెడ్డి విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
మేయర్‌గా ఎన్నికైన విజయలక్ష్మీ, మోతె శ్రీలతా రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి శ్వేతామహంతి ధ్రువపత్రం అందించారు.
- ఇదీ చూడండి : తొలిసారిగా ఇద్దరు మహిళలకు గ్రేటర్ పీఠం