విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సినీ నటుడు నిఖిల్ కోరారు. హైదరాబాద్ గౌలిగూడలో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరకుల పంపిణీకి హాజరయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలోని మూడు వందల మందికి సరుకులు, వృద్దులకు చీరలను అందజేశారు.
కరోనాపై జరుగుతున్న యుద్ధంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలవాలని నిఖిల్ విజ్ఞప్తి చేశారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు 23 రోజులుగా సరకులు పంపిణీ చేస్తున్న... గడ్డం గంగాధర్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ... కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్, రాష్ట్ర గ్రంథాలయ మాజీ ఛైర్మెన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వైద్య దేవుళ్లకు పుష్పాభిషేకం.. వాయుసేన పూలవాన