ETV Bharat / city

గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్సై అభ్యర్థులకు ఉచిత శిక్షణ... నెలనెలకు స్టైఫండ్‌

Free Training for job seekers: ఉద్యోగ నియామకాల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖలు తమ వంతు ప్రోత్సాహం ఇవ్వనున్నాయి. ఉద్యోగార్థుల కోసం ఉచితంగా శిక్షణ అందించేందుకు ముందుకొచ్చాయి. ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆ శాఖల మంత్రులు, కార్యదర్శులు సూచిస్తున్నారు.

Free Training programs for job seekers in telangana

author img

By

Published : Apr 6, 2022, 3:50 PM IST

Free Training for job seekers: ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థుల్లో లక్షా 25 వేల మందికి బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అన్ అకాడమీ సంస్థతో కలిసి ఉచితంగా ఆఫ్​లైన్, ఆన్​లైన్, హైబ్రిడ్ విధానంలో శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. శిక్షణ కోసం నిర్వహించే ప్రవేశపరీక్ష కోసం ఈ నెల 16 వరకు ఆన్​లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని.. నిరుపేదలకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఉచితంగా శిక్షణతో పాటు పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్సై పోస్టు అభ్యర్థులకు స్టైఫండ్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థానికంగా ఎవరైనా ముందుకు వస్తే అక్కడ శిక్షణకు సహకరిస్తామని గంగుల కమలాకర్ తెలిపారు.

వార్షికాదాయం ఐదు లక్షల్లోపు ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. 16న ఉదయం 11 గంటలకు అన్ని పోటీ పరీక్షల కోసం ఒకే ప్రవేశ పరీక్ష ఉంటుందని... నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా ఇస్తామన్నారు. హైబ్రిడ్ నమునాలో శిక్షణ పొందే వారు ప్రాక్టీసింగ్​కు కూడా అవకాశం ఉంటుందని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ పొందే ప్రతి ఒక్కరికీ ప్రవేశ పరీక్ష తప్పనిసరి అని బుర్రా వెంకటేశం తెలిపారు.

మరోవైపు ఉద్యోగ నియామకాల కోసం సన్నద్ధమయ్యే ఎస్సీ అభ్యర్థులకు కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ తెలిపింది. 33 జిల్లా కేంద్రాల్లో స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో చోట 75 నుంచి 150 మంది వరకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలకు ఫౌండేషన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. డిగ్రీ పూర్తైన వారు దీనికి అర్హులని... మార్కుల శాతం ఆధారంగా శిక్షణకు ఎంపిక చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు తెలిపారు.

ఎంపికైన విద్యార్థులకు భోజన వసతి కోసం రోజుకు 75 రూపాయలతో పాటు 1500 రూపాయల విలువైన స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ వార్షికాదాయం మూడు లక్షల్లోపు ఉన్నవారు మాత్రమే అర్హులన్నారు. శిక్షణ కోసం tsstudycircle.co.in ద్వారా ఈ నెల 18 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 25 నుంచి శిక్షణ ప్రారంభంకానుంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.