ETV Bharat / city

Corona: నెల రోజుల వ్యవధిలో నలుగురు కరోనాతో మృతి - telangana news

కరోనా విలయంలో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో తెలియని పరిస్థితి. కొవిడ్‌తో కుటుంబంలో కొందరు మరణిస్తే.. మిగిలినవాళ్లు భవిష్యత్తుపై ఆందోళనతో బతకాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏపీలోని కర్నూల్లో ఓ ఉమ్మడి కుటుంబంలో నెలరోజుల వ్యవధిలో నలుగురు మరణించారు. అన్మదమ్ములిద్దరూ కొవిడ్‌కు బలి కావటంతో మగదిక్కులేని కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలోనని కుటుంబం ఆందోళన చెందుతోంది.

Corona deaths, ap covid deaths
కరోనాతో మృతి, ఏపీ కరోనా మరణాలు
author img

By

Published : May 28, 2021, 1:31 PM IST

కరోనాతో మృతి, ఏపీ కరోనా మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు బాలాజీనగర్‌కు చెందిన జయలక్ష్మికి ఇద్దరు కుమారులు. పెద్దోడు రామిరెడ్డి, చిన్నోడు శ్రీధర్‌రెడ్డి.. వివాహాలు చేసుకున్న తరువాత ఒకే ఇంట్లో ఉంటున్నారు. పిల్లాపాపలతో సంతోషంగా బతుకుతున్న ఆ ఉమ్మడి కుటుంబాన్ని కరోనా(Corona) కాటు వేసింది. నెల రోజుల వ్యవధిలోనే ఇంటి పెద్ద జయమ్మ, ఆమె ఇద్దరు కుమారులు సహా నలుగురుని బలి తీసుకుంది. దాదాపు రూ.20 లక్షలు దాకా ఖర్చు చేసినా ఒక్కరి ప్రాణమూ దక్కలేదు. అటు ఆర్థికంగానూ, మానసికంగానూ ఆ కుటుంబం దీనస్థితిలోకి వెళ్లిపోయింది.

పెద్ద కుమారుడు రామిరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు ఉదయేశ్వర్‌రెడ్డి సంతానం. చిన్నకుమారుడు శ్రీధర్‌రెడ్డి, సుజాత దంపతులు.. సాహిత్య, రామవర్ధన్‌రెడ్డికి జన్మనిచ్చారు. ఈ కుటుంబంలో తొలుత శ్రీధర్‌రెడ్డికి కరోనా వచ్చింది. కర్నూలు సర్వజన వైద్యశాలలో చేర్చించగా.. 2 రోజులు మృత్యువుతోపోరాడి.. ఏప్రిల్‌ 25న మరణించారు. కొడుకు మరణించిన 5 రోజులకే తల్లి జయలక్ష్మి ఇంట్లోనే మరణించింది. శ్రీధర్‌రెడ్డికి వైద్యసేవలు అందించే క్రమంలో సోదరుడు రామిరెడ్డి కరోనా బారినపడ్డారు. కొద్దిరోజుల తేడాలోనే శ్రీధర్‌రెడ్డి భార్య సుజాత పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వీరి పరిస్థితి విషమంగా మారటంతో.. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. మే 7వ తేదీన రామిరెడ్డి, మే 20న సుజాత.. కరోనా చేతిలో ఓడిపోయారు. ముగ్గురు చిన్నారులు, రామిరెడ్డి భార్య విజయలక్ష్మి కరోనాను జయించారు. శ్రీధర్‌రెడ్డి, సుజాత మరణంతో.. సాహిత్య, రామవర్థన్‌రెడ్డి అనాథలయ్యారు. ప్రస్తుతం ఈ కుటుంబానికి విజయలక్ష్మి పెద్దదిక్కుగా మారారు. ఫినాయిల్‌ డిస్ట్రిబ్యూటర్‌గా రామిరెడ్డి, రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్‌గా శ్రీధర్‌రెడ్డి పని చేసేవారు. సంపాదించే వీరిద్దరూ మరణించటంతో... పిల్లల భవిష్యత్తుపై విజయలక్ష్మి ఆందోళన చెందుతున్నారు.

కరోనాతో తల్లిదండ్రులు మరణించటంతో అనాథలైన పిల్లలకు.. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల రూపాయల సాయం వేగంగా అందించి ఆదుకోవాలని కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువాళ్లు కోరారు. మరే కుటుంబానికీ ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని.. బాధితులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: kaleshwaram: ఇంజినీర్లపై సీఎం ఆగ్రహం.. సొరంగ ప్రతిపాదనపై అసహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.