ETV Bharat / city

ఏపీలో 14 వైద్య కళాశాలల నిర్మాణానికి నేడు శంకుస్థాపన - telangana news

ఏపీలో 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. ఆ రాష్ట్ర సీఎం జగన్.. ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.8వేల కోట్ల వ్యయంతో కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటి ద్వారా కొత్తగా 1850 సీట్లతో పాటు, 32 విభాగాలకు సంబంధించి స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ap cm jagan, multi specialty hospitals
ఏపీ సీఎం జగన్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు
author img

By

Published : May 31, 2021, 7:30 AM IST

ఆంధ్రప్రదేశ్​లో ఇవాళ 14 వైద్య కళాశాలల నిర్మాణానికి అంకురార్పణ జరగనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 11 గంటలకు వర్చువల్‌ పద్ధతిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఏపీలో మొత్తం 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పులివెందుల, పాడేరు కాలేజీల పనులు ప్రారంభమయ్యాయి. విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, పాలకొల్లు మెడికల్ కళాశాలలకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల మెడికల్ కళాశాలలు, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పెనుకొండ, అదోని, నంద్యాలలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి.

రూ.8 వేల కోట్ల ఖర్చు..

దాదాపు రూ.8వేల కోట్ల వ్యయంతో కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి వైద్య కళాశాలతో పాటు, నర్సింగ్‌ కళాశాలు ఏర్పాటు చేయనున్నారు.

అదే లక్ష్యం..

2023 చివరి నాటికి కొత్త వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటన్నింటి ద్వారా కొత్తగా 1850 సీట్లతో పాటు, 32 విభాగాలకు సంబంధించి స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైద్య కళాశాలల్లో అత్యాధునిక వసతులు ఏర్పాటు చేయనున్నారు.

సకల వసతులతో మల్టిస్పెషాలిటీ..

ప్రతి మెడికల్‌ కాలేజీలోనూ 500 పడకలు తగ్గకుండా ఏర్పాట్లు, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, డయాగ్నోస్టిక్‌ సర్వీసులు రానున్నాయి. ఐటీ సర్వీసులు, సీసీ కెమెరాలు అనుసంధానం చేయనున్నారు. ప్రతి కాలేజీలోనూ, అనుబంధ ఆసుపత్రిలో 10 మోడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటు చేస్తారు. సెంట్రలైజ్డ్‌ ఏసీతో ఐసీయూ, ఓపీడీ రూమ్స్, డాక్టర్‌ రూమ్స్‌, అన్ని పడకలకు మెడికల్‌ గ్యాస్‌ పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తారు. ఆక్సిజన్‌ స్టోరేజి ట్యాంకులతో పాటు, ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు.

కలెక్టర్ పరిశీలన...

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం ఆరోగ్యవరం దగ్గర.. ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణానికి ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. తాడేపల్లి నుంచి వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న జగన్... అనంతరం ప్రసంగించనున్నారు. సుమారు 475 కోట్ల రూపాయల నాడు-నేడు నిధులతో నిర్మించనున్న వైద్య కళాశాల శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరినారాణయన్... మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవితో కలిసి పరిశీలించారు.

ఇదీ చదవండీ: Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.