హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసే వరకు దళితబంధు పథకం అమలు నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న దళితబంధు పథకం మంచిదే అయినా.. హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆ నియోజవర్గంలోనే తొలుత అమలుచేస్తున్నారని పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయని పద్మనాభరెడ్డి తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పైన ఉందన్నారు.
హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా అంగీకరించారని పద్మనాభరెడ్డి చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసేవరకు దళిత బంధు పథకం అమలును నిలుపుదల చేయాలని ఈసీని కోరారు. ఎన్నిక అనంతరం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలుచేయాలని కోరారు.
ఇదీచూడండి: MLA Rajagopal Reddy: 'ఈటలను ఓడించడానికే.. దళితబంధు పథకం'