ETV Bharat / city

"హైదరాబాద్​లో 350 ఆస్పత్రులకు అనుమతి లేదు" - ఫోరంఫర్ గుడ్ ​గవర్నన్స్

హైదరాబాద్​లో అధిక శాతం ఆస్పత్రులు బయో వేస్టేజ్​ను శుద్ధిచేయడం లేదని ఫోరం ఫర్​ గుడ్​ గవర్నన్స్​ ఆరోపించింది. సుమారు 350 ఆస్పత్రులకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని సీఎస్​కు ఫిర్యాదు చేశారు.

ఆస్పత్రులపై సీఎస్​కు ఫోరంఫర్ గుడ్ ​గవర్నన్స్ ఫిర్యాదు
author img

By

Published : Sep 6, 2019, 11:46 PM IST

హైదరాబాద్​లో 350 ఆస్పత్రులకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆరోపించారు. నగరంలోని ఆస్పత్రుల బయో వేస్టేజ్​ను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధిచేయడం లేదని.. ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి పద్మనాభరెడ్డి ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన అంశాలను ఫిర్యాదులో జతచేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఆస్పత్రిలో వెస్టేజ్ లిక్విడ్ సీవరేజ్ ట్రీట్​మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. వెంటనే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: "కేసీఆర్​ను శిల్పి దేవుడిలా ఊహించుకున్నాడు"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.