ఆ చిలుక పలుకులు ముద్దులొలుకుతున్నాయి. చిన్నిచిన్ని మాటలతో అందరినీ అబ్బురపరుస్తోంది. మాజీ ఎంపీ హర్షకుమార్.. రాజమహేంద్రవరంలోని తన ఇంట్లో ఏడేళ్లుగా ఆ చిలుకను పెంచుతున్నారు. దానికి మాక్స్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. దానికి మాటలు నేర్పించారు. మనం మాట్లాడే మాటలను అది కూడా అనుసరిస్తోంది. ఈ చిలక అమెజాన్ ప్రాంతానికి చెందినదని.. తమ ఇంట్లో భాగమైందని మాజీ ఎంపీ హర్షకుమార్ వెల్లడించారు.
ముద్దుముద్దు మాటలతో
ఏడేళ్ల క్రితం ఈ మకావో చిలుకను ఆయన కుమారుడు తీసుకొచ్చారు. అప్పటినుంచి ఇది మాజీ ఎంపీ ఇంట్లో భాగమైంది. ఇది మనం మట్లాడే వివిధ మాటలు ఇట్టే పలుకుతుంది. హలో, బాగున్నారా, జై భీమ్, జై హర్ష, తోటకూర ఇలా పలు పదాలు వల్లె వేస్తూ.. అందరినీ ఆకట్టుకుంటోంది.
'ఏడేళ్లుగా ఈ చిలుక మాతో ఉంటోంది. మా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయింది. ఇంట్లో వాళ్లందిరినీ గుర్తుపట్టి వారిని పేర్లతో పిలుస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బాగా చలాకీగా ఉండి.. మనమేం మాట్లాడినా చెబుతుంది.' -హర్షకుమార్, మాజీ ఎంపీ
మాక్స్‌కి కోపం ఎక్కువేనండోయ్
ఈ మకావో చిలుక సన్ ఫ్లవపర్ గింజలను ఆహారంగా తీసుకుంటుంది. అలాగే పిస్తా, కొన్ని రకాల పళ్లు కూడా ఆరగిస్తుంది. దీనికి కోపం కూడా ఎక్కువే. పెద్ద బోనులో పెట్టి దీనిని పెంచుతున్నారు. ఈ చిలుకతో పాటు జపాన్‌కు చెందిన చేపలను ఇంటి వరండాలో పెంచుతున్నారు. సందర్శకులను చిలుక, చేపలు ఇట్టే ఆకర్షిస్తున్నాయి.
ఇదీ చదవండి: HEAVY RAINS IN TELANGANA: ఏకధాటి వర్షాలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు.. అవస్థల్లో ప్రజలు